తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాబ్రదర్స్​ను లైన్​లో పెట్టిన హరీశ్ శంకర్ - Harish Shankar Chiranjeevi new movie updates

మెగాస్టార్ చిరంజీవితో హరీశ్ శంకర్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు.

చిరు
చిరు

By

Published : Feb 16, 2020, 5:42 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

పవన్‌ కల్యాణ్‌తో సినిమా పూర్తయ్యాక చిరంజీవితో చేస్తానని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెలిపాడు. విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతానికి విచ్చేసిన హరీశ్ మీడియాతో ముచ్చటించాడు. సినీ రంగ ప్రవేశం, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పంచుకున్నాడు. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు.

"పవన్‌తో చిత్రం చేసేందుకు కథ సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అవి పూర్తయ్యాక నా సినిమా ప్రారంభమవుతుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్లు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నా. ఆ తర్వాత చిరంజీవితో చిత్రం తీస్తా."

-హరీశ్ శంకర్, దర్శకుడు

హరీశ్‌- పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' సంచలనం సృష్టించింది. ఫలితంగా ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు చిరు.. హరీశ్‌ దర్శకత్వంలో నటిస్తే చూడాలని చాలామంది అభిలాష. ప్రస్తుతం ఈ విషయంపై స్పష్టత రావడం వల్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details