తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పవన్​ కల్యాణ్​తో సినిమా కోసం ఎదురు చూస్తున్నా' - pawan kalyan new movie

'గబ్బర్ సింగ్'​తో భారీ హిట్​ కొట్టిన దర్శకుడు హరీశ్​ శంకర్​ మరోసారి పవన్​ కల్యాణ్​తో సినిమా చేస్తానని అన్నాడు. అందుకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

పవన్

By

Published : Sep 17, 2019, 8:37 AM IST

Updated : Sep 30, 2019, 10:15 PM IST

మెగాహీరో వరుణ్​తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వాల్మీకి'. పూజాహెగ్డే కథానాయిక. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కు రీమేక్‌గా రూపొందింది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు. పవన్​ కల్యాణ్​తో సినిమా చేస్తానని అన్నాడు.

"ఒక వారం కిందటే పవన్‌కల్యాణ్‌ని కలిసి ‘'వాల్మీకి' ట్రైలర్‌ చూపించాను. చాలా బాగుంది అన్నారు. ఆయనతో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా అని ఎదురు చూస్తున్నా. ఫ్యాన్స్ మీరూ కోరుకోండి. తప్పకుండా జరుగుతుంది." అంటూ మనసులోని మాట బయటపెట్టాడీ 'గబ్బర్ సింగ్' దర్శకుడు.

ఇవీ చూడండి.. 'హారర్'​ గూటికి చేరిన భళ్లాలదేవుడు..!

Last Updated : Sep 30, 2019, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details