తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూజ రెమ్యునరేషన్​పై దర్శకుడు క్లారిటీ - వాల్మీకి

వ‌రుణ్ తేజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. హరీష్ శంక‌ర్ దర్శకుడు. ఈ సినిమాలో పూజాహెగ్డే భారీ రెమ్యునరేషన్​ తీసుకుందని వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు హరీష్​ క్లారిటీ ఇచ్చారు.

పూజాహెగ్డే రెమ్యునరేషన్​పై దర్శకుడు క్లారిటీ

By

Published : May 4, 2019, 10:29 AM IST

తమిళ హిట్​ చిత్రం జిగర్తాండా రీమేక్​గా వస్తోన్న తెలుగు చిత్రం'వాల్మీకి'. వరుణ్​ తేజ్​, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా కోసం... పూజా భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌న్న వార్త‌లను కొట్టపారేశారు హరీష్​.

పవర్​స్టార్​తోనూ అబద్ధమే..

పవర్​స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హరీష్ ఓ సినిమా చేసేందుకు సమాలోచనలు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇందులోనూ నిజం లేద‌ని హ‌రీష్ త‌న ట్విట్టర్​లో పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన గబ్బర్​సింగ్​ సూపర్​హిట్​ అయిన సంగతి తెలిసిందే.

'సినిమా అభిమానులు ఇలాంటి రూమ‌ర్స్ ప‌ట్టించుకోవ‌ద్ద‌ు. నా నుంచి లేదంటే ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తేనే ఏ విషయాన్నైనా నమ్మండి'.
--హరీష్​ శంకర్​, దర్శకుడు

వరుణ్​ 'అల్లాదిన్'​ చిత్రంలోనూ నడిస్తున్నాడు. పూజా హెగ్డే నటించిన 'మహర్షి' ఈ నెల 9న విడుదల కానుంది. మరో చిత్రం 'హౌస్​ఫుల్'లోనూ ఈమె సందడి చేయనుంది.

'వాల్మీకి' చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు తెరపై అరంగేట్రం చేయనున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా... ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

ABOUT THE AUTHOR

...view details