తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దొంగతనం కథతో 'ఏటీఎం' వెబ్ సిరీస్.. త్వరలో షూటింగ్ - harish shankar pawan kalyan movie

ATM web series: స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ క్రేజీ వెబ్ సిరీస్​కు కథ అందించారు. 'ఏటీఎం' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సిరీస్​, త్వరలో షూటింగ్ మొదలుకానుంది.

atm web series
'ఏటీఎం' వెబ్ సిరీస్

By

Published : Jan 27, 2022, 2:01 PM IST

'గబ్బర్‌సింగ్‌', 'గద్దలకొండ గణేష్' వంటి కమర్షియల్‌ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించిన ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ప్రస్తుతం ఆయన ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. భారీ దొంగతనం నేపథ్యంలో సాగే కథతో ఆయన ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 కోసం హరీశ్‌ శంకర్‌ ఓ కథ సిద్ధం చేశారు.

'ఏటీఎం' వెబ్ సిరీస్

'ఏటీఎం' పేరుతో హైదరాబాద్​ నేపథ్యంగా తీసిన ఈ సిరీస్​ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.చంద్రమోహన్‌ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం 'ఏటీఎం' టైటిల్‌ పోస్టర్‌ హరీశ్‌ శంకర్‌ ట్వీట్ చేశారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షితారెడ్డి, హరీశ్‌ శంకర్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details