పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు'. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో చాలా సినిమాలు షూటింగ్‌తో పాటు విడుదల తేదీలనూ వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ కూడా వాయిదా పడనుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించారు నిర్మాత ఎ.ఎం రత్నం.
"మా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికే తెరపైకి రానుంది. దర్శకుడు క్రిష్ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంతేకాదు సంక్రాంతి పండగ అంటే ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల చిత్రం విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.