తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్క్రీన్​ప్లే రాయడానికే ఏడాది పట్టింది: హరిప్రసాద్ - లేటేస్ట్ మూవీ రివ్యూ

'ప్లే బ్యాక్' సినిమా విడుదల సందర్భంగా ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు దర్శకుడు హరిప్రసాద్. క్రాస్​ టైం కనెక్షన్ నేపథ్యంలో సాగే కథే ఈ చిత్రమని తెలిపారు.

hari prasad jakka about 'play back' movie
స్క్రీన్​ప్లే రాయడానికే ఏడాది పట్టింది: హరిప్రసాద్

By

Published : Mar 5, 2021, 6:25 AM IST

"మన తెరపై ఎప్పుడూ చూడని ఓ కొత్త రకమైన కథనం 'ప్లే బ్యాక్‌'లో చూస్తారు. ఇది కాన్సెప్ట్‌ పరంగా ప్రయోగమే కానీ, కథ పరంగా కాదు" అని అన్నారు హరిప్రసాద్‌ జక్కా. ఆయన దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, అనన్య జంటగా నటించిన చిత్రమే 'ప్లే బ్యాక్‌'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు హరిప్రసాద్‌, గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"చిత్ర పరిశ్రమలోకి రాకముందు భౌతిక శాస్త్రం అధ్యాపకుడిని. మన దగ్గర టైమ్‌ ట్రావెల్‌ మీద సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమాలో మనుషులు అలా మరో కాలంలోకి వెళ్లరు. ఫోన్‌ ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. 1993లో ఉన్న ఒక వ్యక్తితో 2019లో ఉండే ఒక వ్యక్తి ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. అలా క్రాస్‌ టైం కనెక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమే ఇది. దీనికి ప్రత్యేకంగా స్ఫూర్తి అంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో సాగే సినిమాలు కొరియా, ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లిష్‌ తదితర భాషల్లో నాకు తెలిసే వంద సినిమాలున్నాయి. వాటితో ఎలాంటి సంబంధం లేకుండా సాగే కథే ఇది. దీనికి స్క్రీన్‌ప్లే రాయడానికే ఒక ఏడాది పట్టింది. ఈ సినిమాకు బాగా నటించేవాళ్లు కావాలి, కానీ వాళ్లకు ఇమేజ్‌ ఉండకూడదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే దినేష్‌ తేజ్‌, అనన్య నాగళ్లను ఎంపిక చేసుకున్నాం. 2 గంటల 18 నిమిషాలు ప్రేక్షకులు కదలకుండా చూసేలా చక్కటి భావోద్వేగాలతో సినిమాని తీర్చిదిద్దాం" అని హరిప్రసాద్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details