సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా.. దేశవ్యాప్తంగా అభిమానులందరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. చాలామంది సెలబ్రిటీలు కూడా రజనీపై తమకు ఉన్న ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించాడు.
రజనీ ఫొటోను తన గుండెపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు హర్భజన్. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అలానే ఫొటో క్యాప్షన్ కూడా తమిళంలోనే రాసుకొచ్చాడు.