తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గులాబితో నిశబ్దంగా విషెస్​ చెప్పిన అనుష్క...! - నిశ్శబ్దం

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ అనుష్కశెట్టి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం'నిశ్శబ్దం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా స్వీటీ ఫొటోతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం.

Nishabdham latest look of anushkashetty
సంక్రాంతి ప్రేక్షకుల కోసం బొద్దుగుమ్మ రెడీ...!

By

Published : Jan 1, 2020, 4:46 PM IST

'భాగమతి' హిట్‌ తర్వాత అగ్ర కథానాయిక అనుష్కశెట్టి నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో జనవరి 31న విడుదలకానుంది. నేడు అనుష్క లుక్​తో ఓ పోస్టర్​ను విడుదల చేసి... నూతన సంతవ్సర శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇందులో స్వీటీ గులాబి పట్టుకుని క్యూట్​గా ఉంది.

నిశ్శబ్దంలో అనుష్కశెట్టి

సినిమాలో కళా ప్రేమికురాలి(ఆర్ట్​ లవర్)గా కనిపించనుంది అనుష్క. ఇతర పాత్రల్లో మాధవన్, హాలీవుడ్​ నటుడు మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రచయిత కోన వెంకట్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​, లిరికల్​ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

నిశ్శబ్దంలో మాధవన్​, అంజలి

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పేసింది అనుష్క. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, రచయిత గోవింద్‌ నిహ్లాని రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details