తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగువారి మనసుదోచిన సొట్టబుగ్గల సుందరి​ తాప్సీ - ఝుమ్మంది నాదం చిత్రంలో తాప్సీ పరిచయం

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సొట్టబుగ్గల సుందరిగా 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది నటి తాప్సీ. టాలీవుడ్​లో నటిగా మంచి గుర్తింపు పొంది బాలీవుడ్​లో హీరోయిన్​గా రాణించే ప్రయత్నం చేస్తుంది. నేడు (ఆగస్టు 1)న తాప్సీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీప్రయాణంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Happy Birthday Taapsee Pannu: journey from Tollywood to Bollywood
మంచు లక్ష్మి మనసుకు నచ్చిన హీరోయిన్​ తాప్సీ

By

Published : Aug 1, 2020, 5:40 AM IST

సొట్టబుగ్గల సుందరిగా టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో అవకాశం దొరికినప్పుడంతా తెలుగులో నటిస్తోంది. ఉత్తరాది చిత్రాల్లో నటిస్తున్న ఉత్తరాది భామే అయినా... తాప్సీకి, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య అనుబంధం విడదీయలేనిది. తెలుగు చిత్రం 'ఝుమ్మంది నాదం'తోనే తెరకు పరిచయమైంది తాప్సీ.

తెలుగుతెరకు పరిచయం

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో తాప్సీ అందం కుర్రకారునీ, అలాగే చిత్ర పరిశ్రమనీ విశేషంగా ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకొంది. 1987 ఆగస్టు 1న దిల్లీలో జన్మించిన నటి ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రయాణం ఆరంభించింది. ఆ తర్వాత మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. పలు వాణిజ్యప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్న తాప్సీ.. మంచు లక్ష్మి దృష్టిలో పడింది. ఆమె నిర్మించిన 'ఝుమ్మంది నాదం'తోనే తెలుగు తెరకు పరిచయమైంది.

అనతి కాలంలో నటిగా..

ఆ తర్వాత 'వస్తాడు నా రాజు', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'వీర', 'మొగుడు', 'దరువు', 'గుండెల్లో గోదారి', 'సాహసం', 'కాంచన2', 'దొంగాట', 'ఘాజీ', 'ఆనందో బ్రహ్మ' తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. తమిళ చిత్రం 'ఆడుకలమ్‌' ఆరు జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకొంది. 'గుండెల్లో గోదారి'లో తాప్సీ నటనకి మంచి పేరొచ్చింది. మాలాంటి వాళ్లకు తోటి నటులతో ప్రేమాయణం ఫలించదని నమ్ముతానని ఆమె చెబుతుంటుంది. డానిష్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మాథియస్‌ బోయేతో తాప్సీ అప్పట్లో ప్రేమలో ఉన్నారని ప్రచారం సాగింది.

కె.రాఘవేంద్రరావు శైలి గురించి ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. 'నీవెవరో' చిత్రం తర్వాత జూన్‌ 2019లో వచ్చిన 'గేమ్‌ఓవర్‌' అనే సినిమా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్షయ్‌కుమార్‌తో కలిసి 'మిషన్‌ మంగళ్‌' అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం తాప్సి 'హసీన్‌ దిల్‌రుబా', 'లూప్‌ లాపెట', 'షబాస్‌ మిత్తు' అనే చిత్రాల్లో నటిస్తుంది.

తాప్సీ గురించి మరిన్ని విశేషాలు

  • 20 ఏళ్ల వయసులో ఫెమినా మిస్​ ఇండియా 2008 పోటీలో పాల్గొంది తాప్సీ. ప్రధానటైటి​ల్​ గెలవకపోయినా.. ఫెమినా మిస్​ ఫ్రెష్​ పేస్​, ఫెమినా మిస్​ బ్యూటిఫుల్​ స్కిన్​ టైటిళ్లను గెలుచుకుంది.
  • ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని భావించినా.. తన పూర్తి సమయాన్ని మోడలింగ్​కు కేటాయించాలని నిర్ణయించుకుంది. కానీ, మోడలింగ్​పై ఆసక్తిని కోల్పోయి చివరికి నటిగా మారింది. వీ ఛానల్​ నిర్వహించిన టాలెంట్​ షోలో ఎంపికైంది. అక్కడి నుంచి నటిగా ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
  • 2010లో తొలిసారి హీరోయిన్​గా 'ఝుమ్మంది నాదం' చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కామెడీ చిత్రం 'చాష్మే బద్దూర్'​తో బాలీవుడ్​లో అడుగుపెట్టింది. అమితాబ్​ బచ్చన్​ ప్రధానపాత్రలో కనిపించిన పింక్​ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించింది తాప్సీ. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా జీ సినీ అవార్డును దక్కించుకుంది.
  • ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఫిలింఫేర్​ క్రిటిక్స్​ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది తాప్సీ. చివరిగా అనుభవ్​ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన 'తప్పాడ్'​ అనే సినిమాలో నటించింది.

ABOUT THE AUTHOR

...view details