తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్​తో హన్సిక.. భారీ ధరకు 'హరిహరవీరమల్లు' మ్యూజిక్​ రైట్స్​ - హరిహరవీరమల్లు మ్యూజిక్​ రైట్స్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పవన్​కల్యామ్​, హన్సిక, సమంత, విశ్వక్​సేన్​, సుధీర్​బాబు చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

hansika
హన్సిక

By

Published : Jan 12, 2022, 10:42 PM IST

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి'. ఈ నాయికా ప్రాధాన్య చిత్రానికి శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. హన్సిక తన గురించి తాను పరిచయం చేసుకునే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సంభాషణలు బట్టి చూస్తుంటే మనిషి చర్మంతో చేసే వ్యాపారం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. 'చర్మం వలిచి బిజినెస్‌ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను' అనే ప్రశ్నతో టీజర్‌ ముగిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. మురళిశర్మ, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్‌ రాబిన్‌ సంగీతమందిస్తున్నారు.

పవన్​కల్యాణ్​ 'హరిహర వీరమల్లు', సమంత 'శాకుంతలం' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఈ సినిమాల మ్యూజిక్​ రైట్స్​ను.. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్​ ఇండస్ట్రీస్​ సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మ్యూజిక్​ రైట్స్​ను దక్కించుకుందని సమాచారం.

'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ నటిస్తున్న మరో చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమాస్, శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్వంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఓ స్పెషల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విశ్వక్​.. 'ఇంకా రెండు రోజులే ఉంది.. పిల్లని వెతికి పెట్టండి, లేదా కనీసం పడేయడానికి టిప్స్ అయినా ఇవ్వండి' అంటూ కనిపించారు.

సుధీర్​బాబు కొత్త సినిమా తొలి షెడ్యూల్​ పూర్తి


ఇదీ చూడండి: 'బుట్టబొమ్మ' సాంగ్​కు అల్లు అర్హ-పూజాహెగ్డే స్టెప్పులు

ABOUT THE AUTHOR

...view details