తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యతో భళ్లాలదేవ.. 'ఆహాలో' దబిడి దిబిడే! - Rana Daggubati in Unstoppable With NBK

Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​ షోకు అతిథిగా వచ్చారు 'భళ్లాలదేవ' రానా దగ్గుబాటి. బాలయ్యతో రానా చేసిన సందడి ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Unstoppable With NBK
అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే

By

Published : Jan 1, 2022, 10:22 PM IST

Unstoppable With NBK: ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బీకే' షోకు అతిథిగా హాజరయ్యారు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా. అందుకు సంబంధించిన ఫొటోలను షో నిర్వాహకులు షేర్​ చేశారు.

'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​లో రానా

బాలయ్యతో కలిసి రానా ఎలాంటి సందడి చేయనున్నాడా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి 7న ప్రసారంకానుంది.

'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​

'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' షోలో ఇప్పటికే ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, మాస్​ మహారాజా రవితేజ, దర్శకధీరుడు రాజమౌళి, నాని వంటి నటులు సందడి చేశారు. తన చలాకీతనంతో ఈ కార్యక్రమాన్ని తెలుగులో అత్యధిక మంది వీక్షిస్తున్న టాక్​ షోగా నిలిపారు బాలయ్య.

బాలకృష్ణ

ఇదీ చూడండి:బాలయ్య కొత్త సినిమా డైలాగ్​ లీక్ చేసిన డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details