కథానాయిక కాజల్ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబరు 30న వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పసుపు దుస్తుల్లో 'చందమామ'లా మెరిసిన కాజల్ - కాజల్ అగర్వాల్ హల్దీ ఫంక్షన్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిసందడి మొదలైంది. నటి కాజల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును శుక్రవారం వివాహమాడానున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంట 'పసుపు కొట్టే వేడుక'కు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
పసుపు దుస్తుల్లో 'చందమామ'లా మెరిసిపోతున్న కాజల్
కాజల్ ఇంట 'పసుపు కొట్టే వేడుక' సందడిగా జరిగింది. పసుపు వర్ణ దుస్తులు, పూల ఆభరణాలతో కాజల్ 'చందమామ'లా మెరిసిపోయారు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేశారు. కాజల్ సోదరి నిషా అగర్వాల్ తమ ఇంట్లో పనిచేసేవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.