బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కానీ తాను ఆ సినిమా ఆఫర్ తిరస్కరించినట్లు తాజాగా తెలిపారు. అయితే, అది ఏ మూవీ అనేది వెల్లడించలేదు. ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు శ్రీరామ్.
"కంగనా రనౌత్ కథానాయికగా ఉండటం వల్ల ఒక సినిమాను నేను తిరస్కరించాల్సి వచ్చింది. ఎందుకో నేను అసౌకర్యంగా భావించా. నిర్మాతలకు నా పరిస్థితి వివరించా. వారు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మనకు మంచిదనిపించిందే చేయాలి. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్."