తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మలాలా బయోపిక్​ వచ్చేందుకు తేదీ ఖరారు - నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూసుఫ్‌జాయ్

సాహస బాలిక మలాలా యూసుఫ్​జాయ్ బయోపిక్ 'గుల్​ మకాయ్'..​ వచ్చే జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మలాలా బయోపిక్​ వచ్చేందుకు తేదీ ఖరారు
యూసుఫ్ జాయ్ బయోపిక్ 'గుల్​ మకాయ్'

By

Published : Dec 27, 2019, 2:05 PM IST

Updated : Dec 27, 2019, 3:20 PM IST

పాకిస్థాన్‌ సాహస బాలిక, నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూసుఫ్‌జాయ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'గుల్ మ‌కాయ్‌'. మలాలా పాత్రలో రీమ్‌ షేక్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మ‌లాలా త‌ల్లి పాత్ర‌లో దివ్య ద‌త్తా కనిపించనున్నారు. ఓం పురి, రాగిణి ఖ‌న్నాలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అంజద్‌ ఖాన్‌ దర్శకుడు.

గుల్​మకాయ్ సినిమా ఫస్ట్​లుక్

మలాల తన చిన్ననాటి అనుభవాలను 'గుల్‌ మకాయ్‌' అనే పేరుతో డైరీ రూపంలో రాసుకున్నారు. ఉర్దూలో రాసుకున్న ఈ పుస్తకానికి సంబంధించిన కథనం బీబీసీలో ప్రసారమైంది. ఇప్పుడదే పేరుతో మలాలా బయోపిక్‌ తెరకెక్కించారు.

పాకిస్థాన్‌లోని స్వాత్‌లోయలో బాలికల చదువుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినా, 11 ఏళ్ల వయసులోనే మలాలా.. విద్యా హక్కు కోసం పోరాటం చేశారు. 2012లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్యకోసం మలాలా కృషిచేస్తున్నారు.

ఇది చదవండి: నా కంటే చిన్నవాడితో డేట్​కు వెళ్లలేదు: రాధిక

Last Updated : Dec 27, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details