తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమెజాన్ ప్రైమ్​లో 'గాడ్జిల్లా వర్సెస్​ కాంగ్' - గాడ్జిల్లాvsకాంగ్

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'గల్లీ రౌడీ' చిత్రంలోని ఐటమ్ సాంగ్​ రిలీజై ఆకట్టుకుంటోంది. అలాగే హాలీవుడ్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'గాడ్జిల్లా vs కాంగ్'​ అమెజాన్ ప్రైమ్​లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

GullyRowdy
గల్లీ రౌ డీ

By

Published : Jul 22, 2021, 8:10 PM IST

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'చాంగురే ఐటెమ్‌ సాంగ్‌రే' అనే ఐటమ్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని మంగ్లీ, సాయి కార్తీక్‌, దత్తు ఆలపించారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో సందీప్‌ సరసన నేహా శెట్టి కనిపించనుంది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్ తెరకెక్కించిన 'గాడ్జిల్లా vs కాంగ్' అమెజాన్ ప్రైమ్​లో సందడి చేయనుంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా మన దేశంలో మార్చి 24న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. ఆడమ్ వింగార్డ్​ దర్శకత్వం వహించారు. ఇప్పటికే హంగామా ప్లే ఓటీటీలో విడుదలైనా కేవలం ఇంగ్లీష్​లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఇంగ్లీష్​తో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఇవీ చూడండి: 'నా భర్తతో ప్రియమణి వివాహం చెల్లదు'

ABOUT THE AUTHOR

...view details