తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రఖ్యాత ఆస్కార్​ బరిలో బాలీవుడ్​ చిత్రం 'గల్లీబాయ్​' - best foreign movie in oscars 2020

బాలీవుడ్​ స్టార్​లు రణ్​వీర్​ సింగ్​, ఆలియా భట్​ జంటగా నటించిన 'గల్లీబాయ్​' చిత్రం భారత్ తరఫున ఆస్కార్​ కోసం పోటీపడుతోంది. తెలుగు సినిమా 'డియర్ కామ్రేడ్​' స్క్రీనింగ్​కు ఎంపికైన తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

ఆస్కార్​ బరిలో బాలీవుడ్​ చిత్రం 'గల్లీబాయ్​'

By

Published : Sep 21, 2019, 6:40 PM IST

Updated : Oct 1, 2019, 12:03 PM IST

బాలీవుడ్​ సూపర్​హిట్ సినిమా 'గల్లీబాయ్'​.. మరో ప్రతిష్టాత్మక వేదికపై పోటీకి సై అంటోంది. వచ్చే ఏడాది జరగబోయే 92వ ఆస్కార్ అవార్డుల ​కోసం భారత్ నుంచి నామినేట్​ అయింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పోటీ పడనుంది. ఇప్పటికే బెర్లిన్​ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు.

గల్లీబాయ్​లో రణ్​వీర్​, ఆలియా

ముంబయి మురికి వాడల్లో పెరిగిన ఓ కుర్రాడు దేశం గర్వించే ర్యాప్‌ గాయకుడిగా ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్ర కథాంశం. ప్రధాన పాత్రల్లో రణ్​వీర్ సింగ్, అలియా భట్ నటించారు. జోయా అక్తర్‌ దర్శకురాలు. రితేశ్ సిద్వాని నిర్మాతగా వ్యవహరించారు. కల్కి కొచ్లిన్, విజయ్​ రాజ్​, సిద్ధాంత్​ చతుర్వేది, అమృత కీలకపాత్రలు పోషించారు.

దాదాపు 28 చిత్రాలను ఆస్కార్​ ఎంట్రీ స్క్రీనింగ్​ కోసం ఎంపిక చేసింది ఫిల్మ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎఫ్​ఎఫ్​ఐ). ఇందులో టాలీవుడ్​ నుంచి విజయ్​దేవరకొండ నటించిన 'డియర్​ కామ్రేడ్'​ పోటీ పడినా.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ఎంట్రీలో ​'కామ్రేడ్​'కు​ నిరాశ...

ఆస్కార్​ ఎంట్రీ స్క్రీనింగ్ జాబితాలో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'డియర్‌ కామ్రేడ్‌' చోటు దక్కించుకుంది. తుది జాబితాలో మాత్రం స్థానం సంపాదించలేకపోయింది.

భారత్ నుంచి వచ్చే ఏడాది ఆస్కార్‌కు పంపాల్సిన సినిమా ఎంపిక ప్రక్రియలో భాగంగా... ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) 28 చిత్రాలకు స్క్రీనింగ్​​ నిర్వహించింది. ఇందులో టాలీవుడ్​ నుంచి 'డియర్‌ కామ్రేడ్' మాత్రమే స్థానం పొందింది. ఈ సినిమాకు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శక‌ుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ చిత్రాలన్నీ చూసిన జ్యురీ సభ్యులు.. 'గల్లీబాయ్'​ చిత్రాన్ని ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో ఆస్కార్‌కు పంపారు. ప్రముఖ ఫిల్మ్‌మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది. ఈ 28 సినిమాల జాబితాలో 'ఆర్టికల్‌ 15', 'బాబా', 'కేసరి', 'కురుక్షేత్ర', 'సూపర్‌డీలక్స్', 'ఉరి', 'వడా చెన్నై' పోటీలో నిలిచినా, వీటికి నిరాశే ఎదురైంది.

ఇది చదవండి: ఆస్కార్ ఎంట్రీ లిస్టులో 'డియ‌ర్ కామ్రేడ్‌'

Last Updated : Oct 1, 2019, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details