తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2021, 9:43 PM IST

ETV Bharat / sitara

ఐటమ్ సాంగ్​తో సందీప్.. 'సెహరి' షూటింగ్ పూర్తి

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. తాజాగా ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్​ ప్రోమోను విడుదల చేశారు. హ‌ర్ష్ క‌నుమిల్లి హీరోగా ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కిస్తోన్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సెహరి' షూటింగ్ పూర్తయింది.

Gully Rowdy
గల్లీరౌడీ

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'చాంగురే ఐటెమ్‌ సాంగ్‌రే' అనే ప్రత్యేకగీతానికి సంబంధించి ప్రోమో వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని మంగ్లీ, సాయి కార్తీక్‌, దత్తు ఆలపించారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. పూర్తి లిరికల్‌ వీడియోను ప్రముఖ నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జులై 22న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్‌ సరసన నేహా శెట్టి కనిపించనుంది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

హ‌ర్ష్ క‌నుమిల్లి హీరోగా ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కిస్తోన్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సెహరి'. సిమ్ర‌న్ చౌద‌రి నాయిక‌. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది చిత్రబృందం. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ ట్రాక్‌, టీజర్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.

సెహరి షూటింగ్ పూర్తి

ఇవీ చూడండి: 'ఒక్కో సీన్ అద్భుతం.. డబ్బింగ్ చెప్పగలనా అనుకున్నా'

ABOUT THE AUTHOR

...view details