తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్​ బరి నుంచి 'గల్లీబాయ్​' ఔట్​ - indian oscar winning movies

ప్రఖ్యాత ఆస్కార్​ నామినేషన్​​ ప్రక్రియలో బాలీవుడ్​ సినిమా 'గల్లీబాయ్​' అవకాశం కోల్పోయింది. తదుపరి రౌండు ఓటింగ్​ నామినేషన్​ ఎంపికలో విఫలమైంది.

'Gully Boy' out of Oscar race
ఆస్కార్​ బరినుంచి 'గల్లీబాయ్​' ఔట్​

By

Published : Dec 17, 2019, 11:29 AM IST

రణ్​వీర్​ సింగ్​ ప్రధాన పాత్రలో నటించిన 'గల్లీబాయ్​' చిత్రం ఆస్కార్​ రేసు​ నుంచి తప్పుకుంది. అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10సినిమాలు ఎంపిక కాగా.. తదుపరి రౌండు​ ఓటింగ్​ సమయంలో భారత్​ నుంచి వెళ్లిన గల్లీబాయ్ అకాడమీ నామినేషన్​కు​ ఎంపికవడంలో విఫలమైంది. 92వ ఆస్కార్ నామినేషన్​ రేసు​​లో ప్రస్తుతం 9 సినిమాలు ఉన్నాయి.

ఆస్కార్​ నామినేషన్​ బరిలో నిలిచిన సినిమాలు..

సౌత్ ​కొరియా దర్శకుడు బాంగ్​ జోన్​ తెరకెక్కించిన 'పారాసైట్'​ చిత్రం. స్పెయిన్​కు చెందిన 'పెయిన్​ అండ్​ గ్లోరీ', చెక్​ రిపబ్లిక్​ నుంచి వచ్చిన 'ది పెయింటెడ్​ బర్డ్'​, ఈస్టోనియాకు చెందిన 'ట్రూత్​ అండ్​ జస్టిస్'​, ఫ్రాన్స్​ నుంచి 'లెస్​ మిసరబుల్', హంగరీకి చెందిన 'దోస్​ హూ రిమైన్డ్​', నార్త్​ మెకడోనియా నుంచి వచ్చిన 'హనీల్యాండ్'​, పోలాండ్​కు చెందిన 'కార్పస్​ క్రిస్టి', రష్యాకు చెందిన 'బీన్​పోల్', సెనెగల్ నుంచి 'అట్లాంటికా' సినిమాలు నామినేషన్​ బరిలో నిలిచాయి.

92వ అకాడమీ పురస్కారాల తుది నామినేషన్​కు ఎంపికైన చిత్రాలను వచ్చే ఏడాది జనవరి 13న ప్రకటిస్తారు. ఫిబ్రవరి 9న లాస్​ఏంజల్స్​లోని హాలీవుడ్ & హైలాండ్ డాల్బీ థియేటర్​లో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

'గల్లీబాయ్' చిత్రం​ ఆస్కార్​కు నామినేట్​ కాకపోవడం వల్ల బారత్​కు మారోసారి నిరాశ ఎదురైంది. చివరగా భారత్​ నుంచి 2001లో అశుతోష్ గోవారికర్​ దర్శకత్వం వహించిన 'లగాన్'​ చిత్రం నామినేటైంది. ఇంతకుముందు 'మదర్​ ఇండియా'(1958), 'సలాం బాంబే'(1989) చిత్రాలు ఆస్కార్​కు నామినేటయ్యాయి.

ఇది చదవండి: అలా 'ఖైదీ'.. 'సాగర సంగమం' అయింది

ABOUT THE AUTHOR

...view details