తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ ఏడాది ట్విట్టర్లో ట్రెండ్ అయిన 'గల్లీ బాయ్'​ - bollywood latest cinema news

రణ్​వీర్​ సింగ్ హీరోగా జోయా అక్తర్​ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'గల్లీ బాయ్'​. తాజాగా ఈ సినిమా ట్విట్టర్​లో అత్యధికంగా చర్చించుకున్న చిత్రంగా నిలిచింది.

Gully Boy is most tweeted Hindi film of 2019
అత్యధికంగా చర్చించుకున్న సినిమాగా 'గల్లీ బాయ్'​

By

Published : Dec 21, 2019, 10:38 AM IST

రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'గల్లీ బాయ్'.. 2019 లో ట్విట్టర్​లో అత్యధికంగా మాట్లాడుకున్న మొదటి హిందీ చిత్రంగా నిలిచింది.

జోయా అక్తర్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రాపర్స్ నవేద్, షేక్ జీవితాల ఆధారంగా తెరకెక్కించాడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్​ హిట్​ అందుకుంది. ఈ ఏడాది ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఆస్కార్​ నామినేషన్​కు పంపినప్పటికీ తుది జాబితాలో ఎంపిక కావడంలో విఫలమైంది.

ట్విట్టర్​ వేదికగా ఎక్కువ వినోదం పంచిన టాప్​ 10 సినీ ప్రముఖుల జాబితాలో బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ 'షహెన్షా' ట్యాగ్​తో మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అక్షయ్​ కుమార్​, సల్మాన్​ ఖాన్​, షారుక్ ఖాన్​, విజయ్, ఏఆర్​ రెహ్మాన్​, రణ్​వీర్​ సింగ్​, అజయ్​ దేవగణ్​, మహేశ్​ బాబు చిత్ర నిర్మాత అట్లీ వరుస స్థానాలను దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. పాటతో షూటింగ్​ మొదలుపెట్టిన రజనీకాంత్

ABOUT THE AUTHOR

...view details