'గల్లీబాయ్' ఫేమ్ విజయ్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన స్టాఫ్‌లోని ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కారణంగా మహారాష్ట్రలోని గోండియా జిల్లా రాంపూర్ పోలీసులు సదరు నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేడు (మంగళవారం) కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమవ్వలేదు.
వేధింపుల కేసులో 'గల్లీబాయ్' నటుడు అరెస్టు - గల్లీబాయ్ నటుడు విజయ్‌రాజ్ అరెస్టు
బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కారణంగా మహారాష్ట్రలోని రాంపూర్‌కు చెందిన పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
వేధింపుల కేసులో 'గల్లీబాయ్' నటుడు అరెస్టు
విద్యాబాలన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'షెరానీ' సినిమాలో కీలకపాత్ర కోసం విజయ్ రాజ్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరుగుతోంది.