ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో గురువారం, ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమచారం.
'గులాబి' సంగీత దర్శకుడికి గుండెపోటు - సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు రావడం వల్ల సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్
జేడీ చక్రవర్తి-మహేశ్వరిల 'గులాబి' సినిమాతో సంగీతం దర్శకుడిగా అరంగేట్రం చేశారు శశి ప్రీతమ్. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తీసిన 'సముద్రం' చిత్రానికి స్వరాలు సమకూరుస్తూనే గీతాలను ఆలపించారు. హిందీలో 'ఆమ్దానీ అత్తాణ్ని ఖార్చా రూపియ్య'తో పాటు ఇళయారాజా తనయుడు కార్తిక్ రాజాతో కలిసి 'ముఖ్బీర్' చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
ఇవీ చదవండి:
TAGGED:
Shashi Preetam latest news