సాధారణంగా యాక్షన్ సినిమాలంటే కార్ చేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. హీరో వాహనంపై దూసుకుపోతుంటే విలన్లు వెనుక నుంచి ఛేజ్ చేసే సీన్లు సినీ ప్రియులకు థ్రిల్‌ను కలిగిస్తుంటాయి. మరి... అత్యంత ఎక్కువ నిడివి గల చేజింగ్ సన్నివేశం ఏ సినిమాలో ఉందో తెలుసా? 'గాన్ ఇన్ 60 సెకండ్స్' అనే హాలీవుడ్ చిత్రంలో. 40 నిమిషాల పాటు ఆ సన్నివేశం ఈ సినిమాలో ఉంది.
సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్.. 90 కార్లు ధ్వంసం - gone in 60 seconds car chase
అత్యధిక నిడివిగల కార్ చేజింగ్ సీన్ 'గాన్ ఇన్ 60 సెకండ్స్' అనే సినిమాలో చిత్రీకరించారు. 40 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశంలో 90 కార్లు ధ్వంసమయ్యాయట.
సినీ డైరీ: 40 నిమిషాల చేజింగ్.. 90 కార్లు ధ్వంసం
అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు 90 కార్లు ధ్వంసం అయ్యాయి. 1974లో వచ్చిన ఈ చిత్రంలోని చేజింగ్ సీన్.. అత్యంత ఎక్కువ నిడివి ఉన్న సన్నివేశంగా ఘనత కెక్కింది. లక్షా యాభై వేల డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 40 మిలియన్ డాలర్లను వసూలు చేసి అప్పట్లో సంచలన విజయం సాధించింది.
హెచ్.బి.హలిక్కి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆయనే కథ సమకూర్చి నిర్మించాడు. ఇందులో హలిక్కి హీరోగా నటించడం విశేషం.