తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2020, 10:54 AM IST

ETV Bharat / sitara

గ్రామీ నామినేషన్లు షురూ.. రికార్డు వేటలో బియాన్సీ

ప్రఖ్యాత గ్రామీ అవార్డులకు నామినేషన్లు షురూ అయ్యాయి. గ్రామీ-2021 అవార్డుల్లో భాగంగా అత్యధిక విభాగాల్లో అమెరికన్​ సింగర్​ బియాన్సీ పోటీ పడుతోంది. వచ్చే ఏడాది జనవరి 31న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

grammy news 2021
గ్రామీ 2021

సినిమాల్లో ఆస్కార్.. శాస్త్ర సాంకేతికతలో నోబెల్... జర్నలిజంలో పులిట్జర్.. మరి సంగీతంలో అత్యున్నతమైనది ఒక అవార్డు ఉంది. అదే గ్రామీ. తాజాగా ఇందుకు సంబంధించిన 63వ గ్రామీ అవార్డుల నామినేషన్లను నవంబర్​ 24న ప్రకటించారు నిర్వహకులు. వచ్చే ఏడాది జనవరి 31న ఈ వేడుక నిర్వహించనున్నారు. దీనికి ప్రముఖ యాంకర్​ ట్రెవర్​ నో వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు.

ఈసారి నామినేషన్లలో అమెరికన్ సింగర్​ బియాన్సీ దుమ్ములేపింది. 9 విభాగాల్లో ఈ అమ్మడు పోటీపడుతోంది. టేలర్​ స్విఫ్ట్​, డు లిపా, ర్యాపర్​ రాడీ రిచ్​ 6 విభాగాల్లో రేసులో ఉన్నారు.

అమెరికా సింగర్​ బియాన్సీ

ఇవే విభాగాలు..

ఆల్బమ్​ ఆఫ్​ ద ఇయర్​, రికార్డ్​ ఆఫ్​ ద ఇయర్​, సాంగ్​ ఆఫ్​ ద ఇయర్​, బెస్ట్​ న్యూ ఆర్టిస్ట్​, బెస్ట్​ మ్యూజిక్​ వీడియో, బెస్ట్​ ర్యాప్​ ఆల్బమ్​, బెస్ట్​ రాక్​ ఆల్బమ్​, బెస్ట్​ పాప్​ వోకల్​ ఆల్బమ్​, బెస్ట్​ ఆల్టర్నేటివ్​ మ్యూజిక్​ ఆల్బమ్​, బెస్ట్​ గ్లోబల్​ మ్యూజిక్​ ఆల్బమ్​ విభాగాల్లో ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా అమెరికాలోని లాస్ఏంజెల్స్ స్టెంపుల్స్ సెంటర్​లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. 1959 నుంచి ఏటా ప్రేక్షకులని అలరించిన ఉత్తమ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, కళాకారులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details