తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గ్రామీ అవార్డు గ్రహీత గాయకుడు చార్లెస్​ మృతి - music icon Charlie Daniels dies at 83

అమెరికన్​ లెజెండరీ గాయకుడు చార్లెస్​ డేనియల్స్​(83) సోమవారం మృతిచెందారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం అవ్వడం వల్ల ప్రాణాలు విడిచారు.

charles
చార్లెస్

By

Published : Jul 7, 2020, 1:01 PM IST

గ్రామీ అవార్డు గ్రహీత అమెరికన్​ ప్రముఖ గాయకుడు చార్లెస్​ డేనియల్స్​(83) సోమవారం తుదిశ్వాస విడిచారు. శరీరంలో అంతర్గత రక్తస్రావం అవ్వడం వల్ల చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి స్పష్టం చేశారు.

1970లో కెరీర్​ ప్రారంభించిన డేనియల్స్ నిరంతరంగా ఏడాదికి 250 స్టేజీ షోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 1979లో ఆయన పాడిన 'ది డెవిల్​ వెంట్​ డౌన్​ టు జార్జియా' అనే పాటతో స్టార్​డమ్​ను సంపాదించుకున్నారు.

చార్లెస్​

'లాంగ్​ హెయిర్డ్​ కంట్రీ బాయ్'​, 'అన్​ఈజీ రైడర్'​, 'డ్రింకన్​ మై బేబీ గుడ్​బాయ్'​, 'స్ట్రోక్స్​ థీమ్'​, 'బ్లూ స్టార్'​ వంటి హిట్​ పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

సోమవారం రోజున ఆస్కార్​ అవార్డు గ్రహీత ఇటాలియన్​ ప్రముఖ గాయకుడు ఎన్నియొ కూడా అనారోగ్యంతో మృతి చెందారు.

ఇది చూడండి : ఆస్కార్ అవార్డు గ్రహీత ఎన్నియొ మృతి

ABOUT THE AUTHOR

...view details