తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవతార్ సీక్వెల్స్​లో గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ నటుడు - అవతార్

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'లో హరాగ్​ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బ్రెండన్ కోవెల్ అవతార్ సీక్వెల్స్​లో నటించనున్నాడు. చిత్రంలోని మిక్స్ స్కోర్స్​బీ పాత్ర కోసం బ్రెండన్​ని ఎంచుకుంది చిత్రబృందం.

బ్రెండన్ కోవెల్

By

Published : Mar 29, 2019, 5:00 PM IST

గేమ్ ఆఫ్ థ్రోన్స్​ సిరీస్​తో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు బ్రెండన్ కోవెల్... మరో పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్​ కామెరూన్ రూపొందిస్తున్న అవతార్ సీక్వెల్​ చిత్రాల్లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు బ్రెండన్.

పాండోరా గ్రహంలో నిధి వెతికే ఓ ప్రైవేట్ సెక్టార్ మెరైన్​కు కెప్టెన్ అయిన మిక్ స్కోర్స్​బీ పాత్ర కోసం బ్రెండన్​ను ఎంచుకుంది చిత్రబృందం. అతడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏడో భాగంలో​ కనిపించే హరాగ్​ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో అవతార్ చిత్రీకరణలో పాల్గొననున్నాడు.

అవతార్ కుటుంబంలోకి బ్రెండన్​ని ఆహ్వానిస్తున్నాం. ఈ సినిమాలో మిక్​ స్కోర్స్​బీ అనే కీలక పాత్రలో బ్రెండన్ నటిస్తున్నాడు -జాన్ లాన్​డౌ, అవతార్ నిర్మాత

2009లో వచ్చిన అవతార్ సినిమా ఘనవిజయం సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకి రెండు సీక్వెల్స్​ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని 2020 డిసెంబర్ 18న విడుదల చేయనుంది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details