టాలీవుడ్ హీరో గోపీచంద్, మరో రెండు రోజుల్లో 'చాణక్య'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈలోపే మరో కొత్త చిత్రం ప్రారంభించాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గురువారం.. హైదరాబాద్‌లో చిత్రీకరణ లాంఛనంగా మొదలైంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టాడు.
'చాణక్య'కు ముందే గోపీచంద్ 'సీటీమార్'..! - gopichand hero
కథానాయకుడు గోపీచంద్.. సంపత్‌నంది దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇదే దర్శకుడితో ఇంతకుముందు 'గౌతమ్ నంద' అనే సినిమా చేశాడీ హీరో.
గోపీచంద్ ఇక నుంచి 'సీటీమార్'..!
ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'సీటీమార్' అనే ఊరమాస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: యూఎస్‌లో చిరు జోరు.. వన్ మిలియన్ క్లబ్లో 'సైరా'
Last Updated : Oct 4, 2019, 8:45 AM IST