ఆత్రేయపురం అంటే పూత రేకులు. పూత రేకులు అంటే ఆత్రేయపురం అనాల్సిందే. అంతేనా, వెండితెరపైనా ఈ ఊరు పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామీణ నేపథ్యం, కుటుంబ కథా చిత్రాల చిత్రీకరణకు నెలవుగా మారింది. ఇప్పుడు ఇదే ఊరిలో సందడి చేయబోతున్నాడు గోపీచంద్. అయితే ఈ హీరో ఆ ఊరు వెళ్లలేదండి. ఆత్రేయపురం గ్రామ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సంక్రాంతికి కానుకగా విడుదల చేసింది చిత్రబృందం.
ఆత్రేయపురంలో 'గోపీచంద్ 28' చిత్రీకరణ..! - gopichand sampath nandi new movie
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. 'గోపీచంద్ 28' గ్లింప్స్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. చిత్రీకరణ జరిగే కొన్ని సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మరి ఈ చిత్రంలో ఆత్రేయపురం ఎలా చూపించబోతున్నారో, ఆ ఊరికి గోపీకి సంబంధం ఏంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇవీ చూడండి.. సంక్రాంతికి షూటింగ్ పూర్తి... ఉగాదికి విడుదల