టాలీవుడ్ కథానాయకుడు గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'సీటీమార్'. ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబర్ 3న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది ఈ మూవీ.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ కబడ్డీ కోచ్‌ల పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించగా, శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది.
మాస్‌లుక్‌తో గ్యాంగ్‌స్టర్ గంగరాజు..
చదలవాడ లక్ష్య హీరోగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మాస్‌లుక్‌తో దర్శనమిచ్చాడు లక్ష్య. చుట్టూ మల్లయోధులు కూర్చొని ఉండగా మధ్యలో కొబ్బరిబోండం తాగుతూ సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో వేదిక దత్.. లక్ష్యతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
చదలవాడ పద్మావతి శ్రీనివాస్ రావు ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.
స్పైడర్ మ్యాన్ రిలీజ్ డేట్..
హాలీవుడ్ మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'కు సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు. ఇండియాలో డిసెంబర్ 17న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. క్రిస్ట్మస్ పండగను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.