వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. త్వరలో చాణక్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మరో సినిమాను పట్టాలెక్కించాడు. బినుసుబ్రహ్మణ్యం అనే నూతన దర్శకుడితో ఓ యాక్షన్ - అడ్వెంచర్ చేయబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.
ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. సతీశ్ కరుప్ కెమెరామాన్. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.