గోపీచంద్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్'. రాశీ ఖన్నా నాయిక. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూన్ 12న గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు సర్‌ప్రైజ్ అందించింది చిత్ర బృందం. సామాజిక మాధ్యమాల వేదికగా గోపీచంద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని పంచుకుంది.
'పక్కా కమర్షియల్' లుక్‌లో గోపీచంద్ - గోపీచంద్ పక్క కమర్షియల్ న్యూ లుక్
గోపీచంద్, రాశీ ఖన్నా ప్రధానపాత్రల్లో మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్'. శనివారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం.
గోపీచంద్
ఈ పోస్టర్లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు గోపీచంద్. కళ్లద్దాలు పెట్టుకుని, టక్ చేసుకుని క్లాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఓ పాటకు సంబంధించిన సన్నివేశంలోని ఫొటో ఇది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఆ అదిరిపోయే పాట ఏంటో వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.