టాలీవుడ్ హీరో గోపీచంద్.. 'చాణక్య'తో బిజీగా ఉన్నాడు. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్రబృందం... దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడీ కథానాయకుడు.
దసరా బరిలో 'చాణక్య'.. క్లాసీ లుక్‌లో గోపీచంద్ - zarin khan
గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'చాణక్య'ను దసరాకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందీ సినిమా.
దసరా బరిలో 'చాణక్య'.. క్లాసీ లుక్‌లో గోపీచంద్
మెహరీన్, జరీన్‌ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇది చదవండి: రొమాంటిక్ మూడ్‌లో గోపీచంద్.. ఇటలీలో షూటింగ్
Last Updated : Sep 29, 2019, 4:17 AM IST