తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోపీచంద్.. 'పక్కా కమర్షియల్' హీరో

హీరోగానే కాక విలన్​గానూ నటించి ప్రేక్షకులను మెప్పించారు హీరో గోపీచంద్. 'యజ్ఞం', 'రణం' వంటి సినిమాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం 'సీటీమార్', 'పక్కా కమర్షియల్' అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈరోజు (జూన్ 12) ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

GOPICHAND
గోపీచంద్

By

Published : Jun 12, 2021, 5:32 AM IST

హీరోగా పరిచయమై.. అనంతరం విలన్​గా భయపెట్టి.. మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కుకుని.. యాక్షన్ చిత్రాలతో మాస్​ ప్రేక్షకుల్ని అలరించిన హీరో గోపీచంద్. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

1979 జూన్ 12న ప్రకాశం జిల్లా టంగుటూరులో జన్మించారు గోపీచంద్. తండ్రి.. పేరున్న దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి రష్యాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను 2013లో వివాహం చేసుకున్నారు.

'తొలివలపు'తో అరంగేట్రం

సినిమాపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు గోపీచంద్. 2001లో వచ్చిన 'తొలివలపు' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి విజయాల్ని అందుకున్నారు. ఈ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ 'యజ్ఞం' సినిమాతో మళ్లీ హీరోగా మారారు. 'రణం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. యజ్ఞం, రణం విజయాలతో మాస్​ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు.

యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే నటుడిగా గోపీచంద్​కు​ మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో వినోదాత్మక కథల్లోనూ మెప్పించగలనని కొన్ని చిత్రాలతో నిరూపించారు. 'ఒక్కడున్నాడు', 'లక్ష్యం', 'శౌర్యం', 'గోలీమార్‌', 'సాహసం', 'లౌక్యం', 'జిల్‌' తదితర చిత్రాలు గోపీచంద్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా ఈ హీరో నుంచి వచ్చిన 'చాణక్య' నిరాశపర్చింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్'తో పాటు మారుతితో 'పక్కా కమర్షియల్' చిత్రాలు చేస్తున్నారు గోపీచంద్.

ఇవీ చూడండి: Sonusood: పేద సివిల్స్ అభ్యర్థుల కోసం స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్

ABOUT THE AUTHOR

...view details