టాలీవుడ్ హీరో గోపీచంద్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన చాణక్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా మరో కొత్త చిత్ర ప్రకటన చేశాడు. యూ టర్న్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో సంపత్ నంది దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాస చిట్టూరి ప్రకటించాడు.ఇంతకుముందు సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'గౌతమ్ నంద' మంచి విజయాన్ని అందుకుంది.