కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటిస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్‌డౌన్‌కి ముందే సినిమా 60 శాతంపైగా చిత్రీకరణ జరుపుకొంది.
గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ - గోపీచంద్ పుట్టినరోజు
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రేపు (జూన్12) గోపి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.
గోపీచంద్
వచ్చే ఆగస్టు మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభించి ఒకటే షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుంది. రేపు జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఈ చిత్రంలో దిగంగన సూర్వవన్షి గోపీచంద్ లవర్‌గా నటిస్తుండగా, పోసాని, రావు రమేష్, భూమిక తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.