Google India tribute Sirivennela sitaramasastry: తన కలంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.
OK Google, Play Sirivennela songs: సిరివెన్నెల 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్
Sirivennela sitaramasastry Google India: అనారోగ్యంతో తదిశ్వాస విడిచిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతరామాశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళి ఘటించింది.
సిరివెన్నెలకు గూగుల్ ఇండియా నివాళి
ఈ క్రమంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళులు అర్పించింది. "సిరివెన్నెలతో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం" అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. 'ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్ను తన ట్వీట్లో రాసుకొచ్చింది.
ఇదీ చూడండి: 'తెలుగు పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజం సిరివెన్నెల'