ఇంటర్నెట్లో ఫొటోల కోసం చాలామంది గూగుల్ ఇమేజెస్‌ను వాడతారు. మరీ ఈ ఇమేజెస్ పోర్టల్ ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా..! మొదట్లో గూగుల్‌ను సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే వాడేవాళ్లు. అప్పట్లో గూగుల్ ఇమేజెస్ ఉండేవి కావు. కానీ 2000 సంవత్సరంలో జెన్నిఫర్ లోపెజ్ వేసుకున్న డ్రెస్ మాత్రం.. ఇమేజెస్ పోర్టల్‌ను తీసుకురావాలనే ఆలోచనను రేకెత్తించింది.
జెన్నీ గ్రీన్ డ్రెస్... తెచ్చింది గూగుల్ ఇమేజెస్! - jenniferlopez
2000 సంవత్సరం గ్రామీ అవార్డు వేడుకల్లో జెన్నిఫర్ లోపెజ్ వేసుకున్న దుస్తులు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆమె డ్రెస్ కోసం వెతికేసరికి కంప్యూటర్ సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయి. అప్పటి నుంచి గూగుల్.. ఇమేజెస్‌ను ప్రారంభించింది.
![జెన్నీ గ్రీన్ డ్రెస్... తెచ్చింది గూగుల్ ఇమేజెస్!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3261047-thumbnail-3x2-jenni.jpg)
జెన్నీ
2000 సంవత్సరంలో జరిగిన గ్రామీ అవార్డు వేడుకకు ప్రముఖ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ హాజరైంది. ఉల్లి పొర లాంటి ఆకుపచ్చ వస్త్రాలతో మెరిసిన జెన్నీ.. అందరినీ ఆకర్షించింది. మరుసటి రోజు దినపత్రికల్లో, టీవీల్లో ఆమె డ్రెస్ గురించే వార్తలు షికారు చేశాయి. ప్రజలు జెన్నీ డ్రెస్ కోసం వెతికేసరికి కంప్యూటర్ సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయి. అప్పటి నుంచే గూగుల్ సంస్థ ఇమేజెస్‌ను ప్రారంభించింది. గూగుల్ ఇమేజెస్ తీసుకొచ్చేందుకు పరోక్షంగా సాయపడిన జెన్నీకి అభినందనలు కూడా తెలిపిందా సంస్థ.
Last Updated : May 12, 2019, 6:44 PM IST