హీరో అక్షయ్ కుమార్... 'హౌస్ ఫుల్ 4'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్ఫ్యూజ్ లవ్ డ్రామాతో హాస్యం పండించి హిట్ అందుకున్నాడు. తన తర్వాతి సినిమా కూడా అదే జోనర్లో చేస్తున్నాడు. 'గుడ్‌న్యూజ్' పేరుతో తెరకెక్కుతోంది. గురవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
విభిన్న కథాంశంతో రూపొందుతోందీ చిత్రం. ఇందులో కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చే యువతులు పాత్రల్లో కియారా అడ్వాణీ, కరీనా కపూర్ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో తికమక పడుతోన్న అక్షయ్ లుక్ ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.