తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుడ్​న్యూస్​ చెప్పనున్న అక్షయ్​, కరీనా - గుడ్​న్యూస్​

బాలీవుడ్​ ఖిలాడీ అక్షయ్​ కుమార్​, కరీనాకపూర్​ జంటగా నటిస్తోన్న చిత్రం 'గుడ్​న్యూస్​'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు నిర్మాత కరణ్​ జోహార్.

గుడ్​న్యూస్​ చెప్పనున్న అక్షయ్​, కరీనా

By

Published : Apr 28, 2019, 7:33 PM IST

Updated : Apr 29, 2019, 10:43 AM IST

రాజ్​మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో అక్ష‌య్‌, క‌రీనా జంట‌గా తెరకెక్కుతోన్న 'గుడ్​న్యూస్​' సినిమా విడుదల తేదీ ఖరారైంది. తొలుత ఈ ఏడాది జులై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కాని డిసెంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత కరణ్​ జోహార్​.

స‌ల్మాన్ ఖాన్ 'ద‌బాంగ్ 3' రిలీజ్ అయిన వారం త‌ర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దిల్జిత్‌ దోసంగ్ , కియరా అడ్వాణీ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

గుడ్​న్యూస్​లో అక్షయ్​, కరీనా​, కియరా, దిల్జిత్​

2015లో గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో కలిసి నటించారు అక్షయ్​-కరీనా. అక్ష‌య్ కేస‌రి చిత్రంతో, కరీనా వీరే ది వెడ్డింగ్​తో చివరిగా ప్రేక్షకులను అలరించారు.

Last Updated : Apr 29, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details