చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు(manchi rojulu vachayi mehreen). ఇప్పుడు మెహ్రీన్‌ను చూస్తే ఆ మాట గుర్తు రావడం ఖాయం. ఇన్నాళ్లూ బొద్దుగా కనిపించి అలరించిన ఈమె... ఇప్పుడు నాజూగ్గా మారింది. సరికొత్త అవతారంతో 'మంచి రోజులు వచ్చాయి'(Manchi rojulu vachayi movie) అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహ్రీన్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...
బయటికి రావాలంటేనే ఆలోచించే సమయంలో మీరు ఈ సినిమా ఒప్పుకొని చేశారు. భయం అనిపించలేదా?
మార్చిలో నాకూ కరోనా వచ్చింది. కొన్ని నెలలపాటు బయటికి రాలేకపోయా. జూన్‌లో ఈ సినిమా కోసం దర్శకుడు మారుతి ఫోన్ చేశారు(manchi rojulu vachayi movie director). కథ వినకుండానే ఓకే అని చెప్పేశా. శుక్రవారం ఫోన్ చేశారు, ఆదివారం సెట్లో ఉన్నా. దీని కోసం కెమెరా ముందుకొచ్చి పని మొదలుపెట్టగానే వ్యక్తిగతంగా నాక్కూడా మంచి రోజలు వచ్చాయనే అనుభూతి కలిగింది. భయాలైతే ఉన్నాయి కానీ, అది ఒకట్రెండు రోజులే. ఆ తర్వాత మామూలైపోయింది. మా నిర్మాతలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మేం లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే పనిచేశాం.
కథ వినకుండా ఒప్పుకోవడం అరుదు కదా?
నాకూ ఇదే తొలిసారి. దర్శకుడు మారుతిపై(manchi rojulu vachayi movie director) నాకున్న నమ్మకం అదంతా. ఆయన నన్నెప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఆయన రాసే కథలు, పాత్రలు అంత బాగుంటాయి. 'మహానుభావుడు' తర్వాత మేం కలిసి చేసిన సినిమా ఇది. ఎప్పట్నుంచో మళ్లీ యు.వి.నిర్మాణ సంస్థలోనూ, మారుతి దర్శకత్వంలోనూ సినిమా చేయాలని ఉండేది. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో అది సాధ్యమైంది. మారుతి సర్‌తోపాటు, హను రాఘవపూడి ఫోన్ చేసినా కథ వినకుండా చేయడానికి సిద్ధపడతా. ఎందుకంటే నా తొలి సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో అంత మంచి పాత్రను రాశారు. అలా కొద్దిమంది దర్శకులపై నమ్మకం అంత బలమైన నమ్మకం ఉంటుంది.
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నేను పద్దు అలియాస్ పద్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమ్మాయిగా కనిపిస్తా. చాలా పరిణతితో ఆలోచించే అమ్మాయి పాత్ర అది. నేనూ, కథానాయకుడు ఒకే కార్యాలయంలో పనిచేస్తుంటాం. తన కూతురు విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా, ఎంతో రక్షణగా ఉండే నా తండ్రి, నేను ప్రేమించిన కుర్రాడు... వీళ్ల మధ్య ఉంటూ నేను చేసిన సందడి ఎలా ఉంటుందనేది తెరపైనే చూడాలి. సెట్‌కి వచ్చాక దర్శకుడు మారుతి ఈ కథని వివరిస్తూ 'మన మనసులకి వ్యాక్సినేషన్ ఇది' అన్నారు. ఆ మాట చాలా నచ్చింది. మనలోని భయాలు, మన ఆలోచనలు మన ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయనే విషయాన్ని ఇందులో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు.
'మంచి రోజులు వచ్చాయి' అంటున్నారు కదా, మీ జీవితంలో మంచి రోజులు అంటే ఏం చెబుతారు?
కచ్చితంగా నా తొలి సినిమా రోజులే అని చెబుతాను. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'(krishna gadi veera prema gaadha movie heroine name) కోసం సెట్స్‌పైకి వచ్చిన క్షణాలు, అది విడుదలైన తర్వాత దానికి వచ్చిన స్పందన, తొలి విజయం... అవన్నీ గొప్ప అనుభూతిని ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ నా తొలి సినిమా రోజులే గుర్తుకొస్తున్నాయి(krishna gadi veera prema gaadha movie cast). చాలా రోజుల తర్వాత నేను సినిమా చేయడం, అదీ సన్నగా మారిపోయి కొత్తగా కనిపిస్తుండడం వల్ల ఇదే నా తొలి సినిమానేమో అన్నట్టుగా ఉంది.