తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గొల్లపూడి మారుతీరావుకు ఆదివారం అంత్యక్రియలు - gollapudi maruthi rao tollywood

గురవారం తుదిశ్వాస విడిచిన ప్రముఖ నటుడు మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రామకృష్ణ చెప్పారు.

గొల్లపూడి మారుతీరావుకు ఆదివారం అంత్యక్రియలు
గొల్లపూడి మారుతీరావు

By

Published : Dec 12, 2019, 5:40 PM IST

చెన్నైలో గురువారం మృతి చెందిన టాలీవుడ్​ ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావుకు ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం నుంచి భౌతికకాయన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతిస్తామని ఆయన కొడుకు గొల్లపూడి రామకృష్ణ చెప్పారు.

గొల్లపూడి మారుతీరావు కుమారుడు రామకృష్ణ

"ఈ రోజు(గురవారం) ఉదయం 11:15 నిమిషాలకు గుండె పోటు(కార్డియాక్ అరెస్ట్)తో నాన్న(గొల్లపూడి మారుతీరావు) పరమపదించారు. వారి అంత్యక్రియలు ఆదివారం పొద్దున్న జరగనున్నాయి. శనివారం ఆయన భౌతికకాయన్ని ఇక్కడికి తీసుకువస్తాం. అప్పటి నుంచి సందర్శకులకు అనుమతిస్తాం" -గొల్లపూడి రామకృష్ణ, మారుతీరావు కుమారుడు

ABOUT THE AUTHOR

...view details