గొల్లపూడి మారుతీరావుకు కాసేపట్లో అంత్యక్రియలు - గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు
మరికాసేపట్లో ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావుకు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలించారు.
గొల్లపూడి మారుతీరావు
ప్రఖ్యాత నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు.. గత గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి చెన్నైలో మరికాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని తదితరులు శనివారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు.
ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో గొల్లపూడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.