ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు తెలుగు చిత్రపరిశ్రమ నివాళులర్పించింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో నటీనటుల సంఘం, రచయితల సంఘం ఆధ్వర్యంలో గొల్లపూడి సంస్మరణ సభను నిర్వహించారు. పరిచూరి గోపాలకృష్ణ, 'మా' ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ సహా పలువురు ప్రముఖులు హాజరై గొల్లపూడికి పుష్పాంజలి ఘటించారు.
రచయితగా, నటుడిగా గొల్లపూడి సేవలను వారు గుర్తుచేసుకున్నారు. గొల్లపూడి లేని లోటు పరిశ్రమకు తీర్చలేనిదని, ఆయన లేకపోయినా.. అందించిన రచనలు సినీ పరిశ్రమకు, సమాజానికి ఉపయోగపడుతూనే ఉంటాయని అభిప్రాయపడ్దారు. గొల్లపూడి మారుతీరావుగారు మళ్లీ రచయితగా పుట్టాలని ఆకాంక్షాంచారు.
ఇవీ చదవండి: