భారతీయ సినిమాను ఏలాలన్నదే తన కల అని అంటున్నాడు యువహీరో విజయ్ దేవరకొండ. అందుకు సంబంధించిన తొలి అడుగు 'ఫైటర్'తో మొదలవుతోందని చెప్పాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి విజయ్ తన మాటల్లో వివరించాడు.
"భారతీయ సినిమాను రూల్ చేయాలనేది నా కల. అందుకు అనుగుణంగానే పూరీ జగన్నాథ్ తీస్తున్న చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. మిగిలిన భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నాం. అయితే ఇందులోని పాత్ర కోసం దేహంతో పాటు నన్ను నేను చాలా మార్చుకున్నా. 'ఫైటర్' నా తొలి అడుగు మాత్రమే. భవిష్యత్లో ఇలాంటి విభిన్న ప్రాజెక్టులతో అభిమానులను అలరిస్తాను"