తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గాడ్​ఫాదర్' సెట్లో సల్మాన్​ ఖాన్​.. ట్వీట్ చేసిన చిరు.. - చిరు గాడ్​ ఫాదర్ మూవీ

Godfather Movie Chiranjeevi: 'గాడ్​ఫాదర్' సెట్లో సందడి చేశారు బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​. సల్మాన్​తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్వీట్ చేశారు.

godfather movie chiranjeevi
మెగా స్టార్ చిరుతో సల్మాన్ ఖాన్​

By

Published : Mar 16, 2022, 11:07 AM IST

Godfather Movie Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 'గాడ్​ఫాదర్' చిత్రంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈమేరకు సల్మాన్ చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై చిరు ట్వీట్​ చేశారు. సల్మాన్​తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్

మెగా స్టార్ చిరుతో సల్మాన్ ఖాన్​

సల్లూభాయ్​ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంకోసం సల్మాన్​ ఖాన్​ వారం రోజుల పాటు డేట్స్​ను కేటాయించినట్లు సమాచారం.

మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్​గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ చేస్తుండటం విశేషం. ఇందులో చిరు సరసన లేడీ సూపర్​స్టార్ నయనతార నటించనుంది. ఈ చిత్రంలో సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళాశంకర్‌' సినిమాలు చేస్తున్నారు. కె. ఎస్‌. రవీంద్ర (బాబీ)తో ఓ చిత్రం ఖరారు చేశారు.

ఇదీ చూడండి:Archana Singh Rajput: అసోం బ్యూటీ అదిరే అందాలు..

ABOUT THE AUTHOR

...view details