తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గాడ్​ ఫాదర్​' సెట్​లో చిరు.. స్క్రిప్ట్​ పనుల్లో పవర్​స్టార్​ - రవితేజ

Godfather Movie Chiranjeevi: కరోనా నుంచి కోలుకుని 'గాడ్​ ఫాదర్'​ సెట్​లో అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు 'హరిహర వీరమల్లు' స్క్రిప్ట్​ పనుల్లో బిజీగా గడిపారు పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌.

chiranjeevi
pawan kalyan

By

Published : Feb 6, 2022, 11:07 AM IST

Godfather Movie Chiranjeevi: ఇటీవలే కరోనా బారినపడిన మెగాస్టార్​ చిరంజీవి.. వైరస్​ నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్​ సెట్​లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించారు చిరు.

మోహన్‌ రాజా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' చిత్రీకరణ హైదరాబాద్​లో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'బాస్​ ఈజ్​ బ్యాక్​' అంటూ ప్రకటించింది చిత్రబృందం. సెట్​లో చిరుతో పాటు నటులు సత్యదేవ్, సునీల్​ కూడా ఉన్నారు.

మలయాళ బ్లాక్‌బస్టర్‌ 'లూసిఫర్‌' రీమేక్‌గా 'గాడ్​ ఫాదర్' తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. నయనతార కథానాయిక. తమన్ సంగీతమందిస్తున్నారు.

స్క్రిప్ట్​ పనుల్లో పవర్​స్టార్..

Pawan Kalyan Hari hara Veera mallu: క్రిష్‌ దర్శకత్వంలో పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తయింది. పలు కారణాల వల్ల షూటింగ్​ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్ట్​ పనుల్లో పాల్గొన్నారు పవన్​కల్యాణ్​.

స్క్రిప్ట్​ పనుల్లో 'హరిహర.. ' చిత్రబృందం

పవన్‌ నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో పవన్‌ ఓ గజదొంగగా కనిపించనున్నట్లు సమాచారం.

పవన్‌కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఎ.దయాకర్‌రావు, ఎ.ఎమ్‌.రత్నం నిర్మాతలు. బాలీవుడ్‌ తారలు అర్జున్‌ రాంపాల్‌, నర్గీస్‌ ఫక్రీ కూడా ఇందులో నటిస్తున్నారు.

ఫిబ్రవరి 7న రవితేజ 'ఖిలాడి' ట్రైలర్

ఇదీ చూడండి:'పోస్టర్​పై నా పేరు వేయండి: హీరో రవితేజ'

ABOUT THE AUTHOR

...view details