కాలిఫోర్నియాలోని పిరూ నదిలో కుమారుడితో పాటు విహారానికి వెళ్లిన హాలీవుడ్ నటి నయా రివెరా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఆమె కోసం హెలికాప్టర్లు, డ్రోన్లతో వెతుకున్నారు అధికారులు.
నదిలో విహారానికి వెళ్లి తప్పిపోయిన నటి - Glee star Naya Rivera missing
కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి వెళ్లిన నటి నయా రివెరా.. బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు.
హాలీవుడ్ నటి నయా రివెరా
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఓ బోటు అద్దెకు తీసుకుని నదిలో విహారానికి వెళ్లింది నయా. అయితే దాదాపు మూడు గంటల తర్వాత లైఫ్ జాకెట్ వేసుకున్న ఆమె కుమారుడ్ని ఓ బోటర్ గుర్తించాడు. ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదు. తప్పిపోయిన నటి కోసం పోలీసులు ఇప్పటికీ ఇంకా గాలిస్తూనే ఉన్నారు.
ఇవీ చదవండి: