కొన్నిరోజుల క్రితం(జులై 8) కాలిఫోర్నియాలోని పిరూ నదిలో విహారానికి వెళ్లిన హాలీవుడ్ నటి నయా రివెరా(33).. అదే నది ఒడ్డున శవమై తేలింది. ఈ విషయాన్ని వెంచురా కంట్రీ షెరిఫ్(పోలీసులు) సోమవారం వెల్లడించారు. అయితే ఆమె శరీరంపై ఆత్మహత్య, హత్య చేసినట్లు గుర్తులు ఏమి లేవని పేర్కొన్నారు.
గత బుధవారం, ఓ బోట్‌ను అద్దెకు తీసుకున్న నయా.. నాలుగేళ్ల కుమారుడితో విహారానికి వెళ్లింది. అయితే ఒకచోట ఆ చిన్నారిని గుర్తించారు కానీ ఆమె మాత్రం కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.