బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్‌కు సంబంధించిన పాత వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ.. మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇటీవలే సుశాంత్ సింగ్, కపిల్ శర్మ ఫ్యాన్‌క్లబ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ చిన్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. 2017, 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమంలో రాజ్‌పుత్ అభిమానులతో ముచ్చటించినప్పటి వీడియో అది. అందులో "మీ గర్ల్‌ఫ్రెండ్ పేరేమిటి?" అని ఓ అభిమాని అడగ్గా.. సుశాంత్ ఆశ్చర్యపోయాడు. అలా కొద్దిసేపు మౌనం పాటించి.. "నేను తర్వాత చెప్తా. ఇప్పుడు అందరి ముందు తన పేరు చెప్తే.. నన్ను అపార్థం చేసుకోవచ్చు" అంటూ సమాధానమిచ్చాడు.