ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం 'జార్జ్ రెడ్డి'. సందీప్ మాధవ్ టైటిల్ రోల్లో కనిపించాడు. జీవన్‌రెడ్డి దర్శకుడు. గత నెలలో విడుదలై, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుందీ సినిమా. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇప్పుడు ఫోర్త్ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 'జార్జ్‌రెడ్డి' - సినిమా వార్తలు
ఫోర్త్ లేక్ వ్యూ అంతర్జాతీయ చిత్రోత్సవానికి టాలీవుడ్ నుంచి 'జార్జ్‌రెడ్డి' ఎంపికైంది. ఈనెల 22, 23న దిల్లీ, నోయిడాల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
జార్జ్‌రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్
ఈనెల 22, 23 తేదీల్లో నోయిడా, దిల్లీలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న 'జార్జ్ రెడ్డి'.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానుంది.
ఇది చదవండి: అందంతో హీటెక్కిస్తున్న 'జార్జ్‌రెడ్డి' భామ