1970-80 కాలంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పేరు సంపాదించాడు 'జార్జ్‌రెడ్డి'. కానీ అతడిని 25 ఏళ్ల వయసులోనే హత్య చేసి చంపేశారు. మృతికి కారణాలు, అప్పటి పరిస్థితులు ఏంటి అనే అంశాలతో ఈ సినిమా తీస్తున్నారు. అతడి జీవితానికి సంబంధించిన చాలా అంశాలు ఇందులో చూపించనున్నామని చెప్పుకొచ్చింది చిత్రబృందం. అయితే గురువారం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉండి సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది.
25 ఏళ్లకే 'జార్జ్‌రెడ్డి'ని ఎందుకు చంపేశారు..!
'జార్జ్‌రెడ్డి' సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. 1970-80ల్లో ఉస్మానియా స్టూడెంట్ లీడర్‌గా ఉన్న 'జార్జ్‌రెడ్డి' జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
25 ఏళ్లకే 'జార్జ్‌రెడ్డి'ని ఎందుకు చంపేశారు..!
'వంగవీటి' ఫేమ్ శాండీ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సత్యదేవ్, శత్రు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'దళం'తో ఆకట్టుకున్న జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సురేశ్ బొబ్బిలి బాణీలు సమకూర్చాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: చిరు అభిమానులకు డబుల్ ధమాకా..!